గిరిజనుల ఆ రాధ్యదైవం, సిరులతల్లి శంబర పోలమాంబ అమ్మవారి పండుగకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.3 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. అధికారులు ప నులు త్వరితగతిన పూర్తి చేయడంలో నిమగ్నమయ్యా రు. మక్కువ మండలం శంబర గ్రామంలో వెలసిన పోలమాంబ అమ్మవారి ఉత్సవం ఈనెల 20 నుంచి 25వరకు జరగనుంది. ఇతర జిల్లాల నుంచి కూడా భ క్తులు భారీగా తరలి వస్తారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుం డా చర్యలు చేపట్టింది.పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ, ఉపాధి హామీ పథకం ద్వారా పోలమాంబ గుడివద్ద క్యూలైన్లలో రూ.50 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశా రు. మరో రూ.20 లక్షలతో ఆలయం నుంచి మెయిన్ రోడ్డు వరకు కాలువలు, సిమెంట్ రోడ్డు నిర్మాణం, ఇం కో రూ.50 లక్షలతో పార్కింగ్ స్థలంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అమ్మవారి రథం ప్రారంభించే వీధి (పణుకువీధి)లో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. వనంగుడి వద్ద కూడా రూ.కోటితో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు.వనంగుడి వద్ద రాజగోపురం నిర్మాణం, భక్తుల కు విశ్రాంతి షెడ్లు, అమ్మవారి చదురు గుడిని శాలహా రంతో సుందరీకరణ, సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం, చదు రు గుడిని ఐదు పక్కల విస్తరణ, అన్నదాన మండపం, అ మ్మవారి ప్రసాదం, వంటశాల నిర్మాణం, కేశఖండన శాల, వనం గుడి చుట్టూ రక్షణ గోడ, పెద పోలమాం బ గుడి నిర్మాణం, అర్చక క్వార్టర్స్ ,కార్యాలయం నిర్మా ణం, క్యూ కాంప్లెక్స్, పొంగల్ షెడ్డు నిర్మాణం తదితర వాటికి శ్రీకారం చుట్టారు. దాతలు కూడా సహకరిం చాలని దేవదాయశాఖ అధికారులు కోరుతున్నారు.‘శంబర గ్రామంతో పాటు అమ్మవారి చదురు గుడి, వనం గుడి వద్ద పూర్తి స్ధాయిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ ఇంత అభివృద్ధి లేదు’ అని మావుడి మాజీ సర్పంచు అక్కేన తిరుపతిరావు తెలిపారు.అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని ఆలయ కార్యనిర్వహణా ధికారి వీవీ సూర్యనారాయణ తెలిపారు.