ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం సర్పంచ్ లక్ష్మి సునీత శనివారం ప్రారంభించారు. గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డును శుభ్రపరిచి మొక్కలను నాటారు. అనంతరం స్వచ్ఛత గురించి మానవహారంతో తెలిపి, ప్రతిజ్ఞ చేశారు. దీనిలో కార్యదర్శి జెడి శ్రీనివాస్, ఉపసర్పంచ్ పడాల దుర్గాభవాని, రాందేవ్ రాజారావు, సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.