రాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ స్కీం(ఎల్‌పీఎస్) కింద భూములు ఇచ్చిన రైతులకు సీఆర్డీయే కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం నగరంలోని సీఆర్డీయే కార్యాలయంలో ఈ-లాటరీ నిర్వహించి ప్లాట్లను కేటాయించారు. రైతులకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రయల్ రన్ వేసి తరువాత ప్రత్యక్ష లాటరీ ప్రక్రియను చేపట్టారు. ఈ-లాటరీలో ప్లాట్లు పొందిన రైతులకు భౌగోళికంగా వారి ప్లాట్లు ఎక్కడ కేటాయించారో వివరించడానికి ప్రత్యేకంగా జీఐఎస్ సిబ్బంది, గ్రామ సర్వేయర్లను నియమించారు. అబ్బరాజుపాలెం, రాయపూడి 1 అండ్ 2, కొండమరాజుపాలెం, వెలగపూడి, మందడం 1 అండ్ 2, గ్రామాలకు సంబంధించిన 39 మంది రైతులకు 72 ప్లాట్లను కేటాయించారు. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు రిజిస్ర్టేషన్ ప్రక్రియ సౌకర్యవంతంగా జరిగేందుకు అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రిజిస్ర్టేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసిందని రైతులకు తెలిపారు. ఈ ప్లాట్ల పంపిణీ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవతేజ, సీఆర్డీయే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె.ఎ్‌స.భాగ్యరేఖ, కె.స్వర్ణమేరి, ప్లానింగ్ విభాగ డైరెక్టర్ బి.సురేష్ కుమార్, తహసీల్దార్ అరుణాదేవి తదితరులు పాల్గొన్నారు.