నిమ్మకూరులో స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు పూలమాలలతో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కూటమి నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమార్ రాజా మాట్లాడుతూ.. తెలుగువారి మనసుల్లో అన్న ఎన్టీఆర్ చిరంజీవిగా నిలిచి ఉంటారన్నారు. 29 ఏళ్లు గడిచినా ఎన్టీఆర్ స్మృతులు నేటికీ ప్రజల కల్ల ఎదుట మెదులుతున్నాయన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మహానుభావుడని.. ఎన్టీఆర్ను తెలుగుజాతీ ఎన్నటికీ మరువదని అన్నారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో తామంతా ప్రజలు మంచి కోసం పనిచేస్తున్నామని ఎమ్మెల్యే రాజా వెల్లడించారు.