వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నామని, భూమిపై ఉన్న ప్రతి ఒక్కరిపై ఆ ఏడు కొండల స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే ఆ స్వామి దర్శనం మాకు కలిగినందుకు ధన్యులమన్నారు. రిపోర్టర్ మాధురీని మాట్లాడమని కోరగా ఆమె మౌనవ్రతం అని చెప్పి తప్పించుకున్నారు.