రాజధానిలో వెంటనే చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సన్నద్ధం కావాలని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) సీఎండీ లక్ష్మీపార్థసారథి అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతి ప్రాంతంలో ఆమె పర్యటించారు. విపత్తు నివారణ పనులకు సంబంధించి క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పనులను ఆమె పరిశీలించారు. కొండవీడువాగు, పాలవాగు, గ్రావిటీ కాలువలను తనిఖీ చేశా రు. ప్రకాశం బ్యారేజీ సమీపంలోని కొండవీడువాగు పంపింగ్ స్టేషన్ను పరిశీలించి.. ప్రతిపాదిత రెండో దశ పంపింగ్ స్టేషన్ పనులపై జలవనరులశాఖ అధికారులతో చర్చించారు. అనంతరం నీరుకొండ, అనంతవరం ప్రాంతా ల్లో పర్యటించారు. మార్గంమధ్యలో ఎన్-9 రహదారినికూడా పరిశీలించి.. రాజధానిలో చేపట్టాల్సిన రోడ్ల పనులపైనా అధికారులతో చర్చించారు.రాజధాని అమరావతిలో కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ పనుల టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన ఎస్ఎ్సఆర్(స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్), స్టాండర్డ్ డేటా ప్రకారం రూపొందించడం జరిగిందని ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి తెలిపారు. మట్టి ఒక క్యూబిక్ మీటర్ తవ్వడానికి ప్రస్తుతం అమలులో ఉన్న రూ.150 చెల్లించవలసి ఉందన్నారు.