ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయంగా జీవించి ఉంటారని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘు రామకృష్ణంరాజు తెలిపారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో రఘు రామకృష్ణంరాజు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రఘు రామకృష్ణంరాజు మాట్లాడుతూ.... చరిత్రలో మరణం లేని నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. గత ఏడాది ఇదే రోజు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధిస్తుందని ఇక్కడే చెప్పానని.. అది నిజమైందని గుర్తుచేశారు. ఎన్టీఆర్కు భారతరత్న నిజమైన గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడం వల్ల భారతరత్నకే గౌరవం వస్తుందని చెప్పారు. ఈ ఏడాది అది నిజమవుతుందని భావిస్తున్నానని అన్నారు. ఎన్టీఆర్ సంఘ సంస్కర్తనే కాదు.. సంక్షేమ పథకాలకు ఆద్యుడని తెలిపారు. పాలన దక్షిత ఉన్న నాయకుడు ఎన్టీఆర్ అని రఘు రామకృష్ణంరాజు కొనియాడారు.