జగదేవపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్ గ్రామ సమీపంలో గల శ్రీ కొండపోచమ్మ జాతర సోమవారం ఘనంగా ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. జిల్లా ఒకటోవ సెషన్ జడ్డి శ్రావణి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్చకులు అమ్మవారి ప్రసాదం అందించి సన్మానించారు.
కొండ పోచమ్మకు వచ్చే భక్తులు కొత్త కొండల్లో నైవేద్యం వండి బోనాన్ని తయారు చేశారు. అనంతరం మహిళలు బోనాలను ఎత్తుకొని డప్పు చప్పుల మధ్య నృత్యం చేస్తూ అమ్మవారికి సమర్పించారు. అలాగే తల్లి పోచమ్మకి ఒడిబియ్యం పోసేందుకు భక్తులు పోటి పడ్డారు. శివసత్తుల శిగాలు, పోతరాజుల వృత్యాలతో ఆలయ ప్రాంగణం జన సంద్రంగా మారింది. పోలీసులు దగ్గర ఉండి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆలయ ఈఓ రవి కుమార్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా దగ్గరుండి చర్యలు తీసుకున్నారు.
భక్తులు కొమరవెల్లి నుంచి భారీ వాహనాలతో కొండపోచమ్మకు బయలుదేరారు. మధ్యాహ్నం నుంచి బారులు తీరడంతో రహదారి అంతా వాహనాలతో కిక్కిరిసిపోయింది. మల్లన్న ఆలయం వద్ద పెద్ద పట్నం, అగ్నిగుండాలు పూర్తిచేసుకుని భక్తులు వాహనాల్లో సాయంత్రం కొండపోచమ్మకు తరలివచ్చారు. ఎస్సై చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా చెక్ పోస్టుల ద్వారా చర్యలు తీసుకున్నారు...