ఒంగోలలో ఎయిర్ పోర్టు నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో కలిసి బుధవారం కొత్తపట్నం మండలంలో ఎయిర్ పోర్టుకు కేటాయించిన భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఒంగోలు ఎంతో అనువైనదని ఎమ్మెల్యే దామచర్ల తెలిపారు. కార్యక్రమంలో ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు పాల్గొన్నారు.