అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, టీడీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటప్ప, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే లక్ష్మీనరసింహ, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.