పెడన మండలంలో ఇసుకపర్ర డ్రైన్, కంచడం మెయిన్ కాలువ, వడ్లమన్నాడు డ్రైన్, లేళ్ల గురువు డ్రైన్ పెడన నియోజవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ గురువారం పరిశీలించారు. సాగునీటి వనరులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. సాగునీటి విషయంలో సంబంధిత అధికారులు ఎక్కడ నిర్లక్ష్యం లేకుండా, పంట కాలువల్లో నీటి సరఫరాకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు కృషి చేయాలని సూచించారు.