తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఓ ఎస్టీ మహిళను బూటు కాలితో తన్ని చిత్రహింసలు పెడితే ఆయనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. ఎమ్మెల్యే తీరుతో గిరిజన మహిళ సూసైడ్ చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు, అధికారులు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం వైయస్ఆర్‌సీపీ నేతల బృందం తిరువూరు నియోజకవర్గం ఏ. కొండూరు మండలం గోపాలపురంలో వైయస్ఆర్‌సీపీ మహిళా నేత భూక్య చంటి కుటుంబాన్ని పరామర్శించింది.