కురుపాంలో అతిసారం బారిన పడిన వారిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి బుధవారం రాత్రి పరామర్శించారు. గాంధీనగర్, గౌడు వీధులను సందర్శించారు. ఈసందర్భంగా కాలువల్లో ఉన్న పైపులను పరిశీలించారు. వెంటనే వాటిని తొలగించి, మరమ్మతులు చేసి, నీరు సరఫరా చేయాలని డీఈఈ కె.నాగేశ్వరరావు, జేఈ వేణుగోపాల్‌ను ఆదేశించారు. అతిసారం వ్యాధి బారిన చిన్నారులను పరమర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలసుకున్నారు. గాంధీనగర్‌లో నిర్వహిస్తున్న వైద్య శిబిరం పరిశీలించి, వైద్యుడు శంకరరావును కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అతిసారం అదుపులో ఉందని, గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జె.ఉమామహేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కోలా రంజిత్ కుమార్, మండల కన్వీనర్ కేవీ కొండయ్య, అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.అలానే కొత్తగూడలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వ కోల్పోయిన బాధితులను ఎమ్మెల్యే తోయక జగదీశ్వ రి బుధవారం పరామర్శించారు. బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు. తహసీల్దార్ శివన్నారాయణ, టీడీపీ మండల అధ్యక్షుడు పాడి సుదర్శనరావు, పార్టీ నాయకులు పద్మావతి, కళావతి తదితరులు పాల్గొన్నారు.