చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య నేడు రెండో టీ20 జరగనుంది. ప్రాక్టీస్ చేసే క్రమంలో అభిషేక్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అదే నిజమై అభిషేక్ మ్యాచ్‌కు దూరమైతే మాత్రం ఓపెనర్‌గా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారనుంది. ఈ క్రమంలో సూర్యకుమార్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉందని సమాచారం.