కుల్‌దీప్ యాదవ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్సీబీపై కామెంట్లు చేశాడు. తనకు ఫుట్‌బాల్, క్రికెట్ అంటే ఇష్టమని వ్యాఖ్యానించాడు. దీంతో ఆర్సీబీ అభిమాని ఒకరు బెంగళూరు ఫుట్‌బాల్ టీమ్‌లో గోల్ కీపర్ పోస్టు ఖాళీగా ఉంది.. దానికోసమైనా నువ్వు టీమ్‌లో చేరాలని కామెంట్ చేశాడు. ఇది చూసిన కుల్‌దీప్ సెటైరికల్‌గా బదులిచ్చాడు. "మీకు గోల్ కీపర్ అవసరం లేదు. మీకు ట్రోఫీ కావాలి. గోల్ కీపర్‌తో మీరేం చేస్తారు" అని సదరు ఆర్సీబీ ఫ్యాన్‌ను ఉద్దేశించి కుల్‌దీప్ వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కుల్‌దీప్ యాదవ్ వ్యాఖ్యల పట్ల ఆర్సీబీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో అతడిని ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. అతడి బౌలింగ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు చితక్కొట్టిన వీడియోలను పంచుకుంటున్నారు. నెట్టింట తనపై ఆర్సీబీ ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ రావడంతో కుల్‌దీప్ యాదవ్ వారిని శాంతపరిచేందుకు ప్రయత్నించాడు. సోషల్ మీడియాలో మరో పోస్టు పెట్టాడు. "చిల్ ఆర్సీబీ ఫ్యాన్స్. ట్రోఫీ మీదే. కానీ నేను గోల్‌కీపర్ కాదు" అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ పోస్టు కూడా నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక కుల్‌దీప్ యాదవ్.. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తరఫున ఆడనున్నాడు. ఆ తర్వాత జరిగే ఐపీఎల్‌లోనూ అతడు బరిలోకి దిగనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున కుల్‌దీప్ ఐపీఎల్ ఆడనున్నాడు.