మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరైంది. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ.. కేసులను బనాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రాజకీయ ప్రతీకార చర్యగా మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను కూడా అరెస్టు చేశారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాదాపు ఐదు నెలలుగా నందిగం సురేష్ జైలులో ఉన్నారు. ఆధారాలు లేకుండా సురేష్‌పై కేసులు పెట్టారంటూ కూటమి సర్కార్‌పై వైయస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు.కాగా... టీడీపీ కార్యాలయం పై దాడిచేసిన వ్యక్తులలో నందిగం సురేష్ ఒకరంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.