ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. కొల్లూరు మండలం చినపులివర్రు గ్రామానికి చెందిన దాసరి దయమనిమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మేరకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 70 వేల రూపాయల చెక్కును బుధవారం బాధితులకు ఎమ్మెల్యే అందజేశారు. ఆపద సమయంలో పేదలను సీఎం సహాయనిధి ఆదుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు.