చిన్నస్థాయి అణు రియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రూ.20 వేల కోట్లతో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 2047 కల్లా కనీసం 100 గిగావాట్ల అణు విద్యుత్‌ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ప్రైవేట్ రంగంలో క్రియాశీలక భాగస్వామ్యం కోసం అణుశక్తి చట్టానికి, అణుశక్తి పౌర బాధ్యత చట్టానికి సవరణలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.