తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్ల మండలం పోతవరం పంచాయతీ కృష్ణాయిగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుంది. వివరాల్లోకి వెళ్ళితే.... గ్రామానికి చెందిన జొన్నకూటి సుబ్బారావు కుమారుడు రాజు కోమటికుంటకు చెందిన నాగదుర్గ(26)ని సుమారు ఆరేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు.వీరికి కుమారుడు,కుమార్తె ఉన్నారు.నాటి నుంచి అత్తమామలతో కలిసే జీవి స్తుంది. భర్త చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెలకొస్తున్నాడు. ఇదిలా ఉండ గా ఇటీవల తాము ఉంటున్న ఇంటి విష యమై మామ సుబ్బారావు,బావ గంగరాజు కలిసి నాగదుర్గతో గొడవపడుతున్నారు. ఇదిలాఉండగా ఇటీవల నల్లజర్లలో పోలీసులకు బావ గంగరాజుపై మరదలు దుర్గ ఫిర్యాదు చేసింది.పోలీసులు పట్టించుకోలేదు.
దీంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. తట్టుకోలేకపోయిన నాగదుర్గ తీవ్ర మనస్తా పానికి గురైంది. సోమవారం భర్త పనిలోకి వెళ్లిన తరువాత పిల్లలను స్కూల్‌కి పంపించి బట్టలు నానబెట్టుకుంది. అనంతరం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.అత్తగారు గమనించి చుట్టుపక్కల వారిని పిలిచి కిందకు దింపారు.అప్పటికే ఆమె మృతి చెందిఉంది.పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తరలించారు. మృతురాలి తండ్రి సేనాపతి సుబ్బారావు ఫిర్యాదు మేరకు అత్తమామలైన సుబ్బారావు, సువార్త, బావగారు గంగరాజు, ఆడబడుచు పున్నమ్మలపై కేసు నమోదు చేశారు.