కూటమి అధికారంలోకి రావడంతో ఐదేళ్ల పీడకల నుంచి రాష్ట్రం బయట పడిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ‘గత ఐదేళ్లలో రాష్ట్రం 20 సంవత్సరాల వెనుక బడింది. ఆయా లోపాలను సరిదిద్దుకుంటూ ఈ ఐదేళ్లలో 15 సంవత్సరాలు రాష్ట్రం ముందుకెళ్లేలా అభివృద్ధి పనులు చేపట్టాం’ అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన వివరించారు. దార్శనికుడైన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందన్నారు. దీనికి కేంద్రం సహకరిస్తోందని, బడ్జెట్‌లోనూ ప్రత్యేక కేటాయింపులు చేయడంతోపాటు ప్రాయోజిత పథకాలద్వారా రాష్ట్రానికి లబ్ధి చేకూరుస్తోందని చెప్పారు.