కావలి, వేదాయపాలెం పోలీసుస్టేషన్లలో తనపై నమోదైన రెండు కేసులను కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ కేసుల్లో తదుపరి చర్యలు నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. టీడీపీ నేతలను వదిలిపెట్టేది లేదని, పోలీసుల పాపాలు వారికి శాపాలు గా మారుతాయంటూ కాకాణి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత ఒంటేరు ప్రసన్నకుమార్ ఫిర్యాదు ఆధారంగా నెల్లూరు జిల్లా కావలి పట్టణ పోలీసులు కేసు నమో దు చేశారు. వెంకటాచలం ఇన్స్పెక్టర్ సుబ్బారావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పద్మయ్య ఇచ్చిన ఫిర్యాదుపై వేదాయపాలెం పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.