ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో భారత ఆటగాళ్లు కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్నారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లు ఫీల్ సాల్ట్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43), బెన్ డక్కెట్(29 బంతుల్లో 6 ఫోర్లతో 32)లను శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ సంచలన ఫీల్డింగ్‌తో పెవిలియన్ చేర్చారు.ఎడాపెడా బౌండరీలు బాదుతూ.. భారత బౌలర్లపై విరుచుకుపడిన ఈ ఇద్దర్నీ కళ్లు చెదిరే క్యాచ్‌తో పాటు అదిరిపోయే రనౌట్‌తో పెవిలియన్ చేర్చారు.యశస్వి, అయ్యర్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో 2 పరుగుల వ్యధిలోనే ఈ ఇద్దరూ పెవిలియన్ చేరడంతో తొలి వికెట్‌కు నమోదైన 75 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ముందుగా అయ్యర్ అసాధారణ త్రో సాయంతో డేంజరస్ ఫిల్ సాల్ట్‌ను రనౌట్‌గా పెవిలియన్ చేర్చగా.. ఆ వెంటనే బెన్ డెక్కెట్‌ను సంచలన క్యాచ్‌తో యశస్వి జైస్వాల్ వెనక్కిపంపాడు.హార్దిక్ పాండ్యా వేసిన 9వ ఓవర్ ఐదో బంతిని ఫిల్ సాల్ట్ బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా గ్యాప్‌లో కట్ షాట్ ఆడాడు. బౌండరీ దిశగా వెళ్లిన బంతిని శ్రేయస్ అయ్యర్ 30 మీటర్లు వేగంగా పరుగెత్తి స్లైడ్ చేస్తూ ఆపాడు. వెంటనే బంతిని వేగవంతమైన త్రోతో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు అందించాడు. అప్పటికే రెండో పరుగు పూర్తి చేసుకున్న ఫిలిప్ సాల్ట్.. మూడో పరుగు కోసం పరుగెత్తాడు. హాఫ్ క్రీజు ధాటిన తర్వాత బెన్ డక్కెట్ పరుగుకు నిరాకరించడంతో యూటర్న్ తీసుకున్నాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న రాహుల్ స్టంప్స్‌కు కొట్టేయడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. దూకుడుగా ఆడిన ఫిలిప్ సాల్ట్ దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు.
హర్షిత్ రాణా వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనూ బెన్ డకెట్ క్యాచ్ ఔటయ్యాడు. ఈ ఓవర్ మూడో బంతిని రాణా.. షార్ట్ లెంగ్త్‌లో వేయగా.. డకెట్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేవగా.. మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న యశస్వి జైస్వాల్ వెనక్కి పరుగెత్తి అద్భుతంగా బంతిని అందుకున్నాడు. దాంతో బెన్ డకెట్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇదే ఓవర్ చివరి బంతికి హ్యారీస్ బ్రూక్(0)ను రాణా కీపర్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ 77 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ ఫీల్డింగ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
అదిరిపోయే క్యాచ్ అందుకున్న యశస్వి జైస్వాల్
బెన్ డకెట్ వికెట్ పడగొట్టిన హర్షిత్ రాణ
ఫ్రీగా చూడండి మీ Disney+Hotstar లో
INDIA vs ENGLAND 1st ODI లైవ్
Sports18 - 2 లో#INDvENGonJioStar pic.twitter.com/7UgRU6Ip02
— StarSportsTelugu (@StarSportsTel) February 6, 2025
![]() |
![]() |