మాడుగుల మండలానికి చెందిన కె. ఆదినారాయణరావు, దెందులూరులో నూతనంగా నిర్మించిన ఆదిత్య పెట్రోల్ బంక్ ను, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఆదినారాయణరావు ఆహ్వానం మేరకు, స్థానిక ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ రావుతో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.