ప్రధాని నరేంద్ర మోదీతో హీరో నాగార్జున భేటీ అయ్యారు. తన కుటుంబ సభ్యులతో సహా పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రధాని కార్యాలయానికి నాగార్జున వచ్చారు. అమల, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల తో సహా ప్రధానితో సమావేశం అయ్యారు.
అయితే గతంలోనూ నాగార్జున పలు సందర్భాల్లో ప్రధానితో భేటీ అయ్యారు. కొద్ది కాలం క్రితం మన్ కీ బాత్ లో మోదీ అక్కినేని నాగేశ్వరరావుపై ప్రశంసలు కురిపించారు. ఆ సమయంలోనే ప్రధాని నుంచి వీరికి ఆహ్వానం అందింది.