మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై శుక్రవారం ఈసీ స్పందించింది. రాజకీయ పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలను, సూచనలను తాము గౌరవిస్తున్నామని ఈసీ తెలిపింది.
రాహుల్ గాంధీ ఆరోపణలపై త్వరలో లిఖితపూర్వకంగా స్పందిస్తామని పేర్కొంది. మహారాష్ట్ర ఓటర్లకు సంబంధించి పూర్తి వాస్తవాలు, విధానపరమైన అంశాలతో కమిషన్ సమాధానం ఇస్తుందని తెలిపింది.
![]() |
![]() |