గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధి లోని గుత్తి డీజిల్ షెడ్ ఆవరణలో శనివారం గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ అందరూ మొక్కలు నాటి మొక్కలను, వృక్షాలను సంరక్షించాలని పిలుపునిచ్చారు.
అనంతరం షెడ్, రైల్వే ప్లాట్ ఫారాల ఎక్స్టెన్షన్ మ్యాప్‌ను పరిశీలించారు. అంతకుముందు డీజిల్ షెడ్లోకి అడుగుపెట్టిన వెంటనే డీఆర్ఎంకు సీనియర్ డీఎంఈ ప్రమోద్ తోపాటు కార్మికులు స్వాగతం పలికారు.