సోంపేట మండలం బేసి రామచంద్రపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. బీహార్ నుంచి శ్రీకాకుళం వస్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడుని చికిత్సకు బారువ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.