అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయంపై కేజ్రివాల్ స్పందించారు. అధికారం కోసం కాకుండా.. సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. అందుకే ఓడిపోయానని పేర్కొన్నారు. ఓడినా ప్రజల వెంటే ఉంటామని తెలిపారు. ప్రజల తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. గత పదేళ్లలో చాలా ప్రజా సమస్యలు తీర్చానని వివరించారు. ఇచ్చిన హామీలను బీజేపీ నేరవేర్చాలని డిమాండ్ చేశారు.