VIVO V50 సిరీస్ పేరుతో ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా వివో V50, V50 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన విడుదల తేదీ సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి. దీంతోపాటు డిజైన్ వివరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వివో V50 సిరీస్ "ఫిబ్రవరి 17" వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. కెమెరా విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే వివో.. త్వరలో లాంచ్ కానున్న V50 సిరీస్‌లోనూ నాణ్యమైన కెమెరాలను అందిస్తోంది. ఇందుకోసం ZEISS లెన్స్‌లను వినియోగిస్తోంది. దీంతోపాటు ఇప్పటికే డిజైన్ కూడా విడుదల అయింది. దీని ఆధారంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది.
వివో V50 స్మార్ట్‌ఫోన్ వివో ఇండియా ఇ-స్టోర్ తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లోనూ కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే విడుదల అయిన టీజర్‌ల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ రోజ్ రెడ్, స్టార్రీ బ్లూ, టైటానియం గ్రే వంటి మూడు రంగుల్లో లభిస్తుంది. వెనుక వైపు Aura LED రింగ్‌ను కూడా కలిగి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు ముందు వైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చి ఉంటుంది. ఈ కెమెరాలు మల్టీపోకల్ ప్రొర్ట్రెయిట్, క్లాసిక్ ప్రొర్ట్రెయిట్, ల్యాండ్‌స్కేప్ ప్రొర్ట్రెయిట్ సహా బొకే ఫీచర్‌లను కలిగి ఉంటాయి. వీటితోపాటు సినిమాటిక్ స్ట్రైల్, సోనార్ స్ట్రైల్ ఫీచర్లను కలిగి ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుత 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. దీంతోపాటు ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో కూడిన వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా ఉంది.
![]() |
![]() |