నిఖార్సయిన వార్తలు,వాస్తవాలతో కూడిన వార్తలను వేగవంతంగా అందిస్తోన్న ప్రముఖ బహుభాషా వార్తా పోర్టల్ వన్ ఇండియా టెక్నాలజీలో కూడా దూసుకెళుతోంది. ఫిల్మ్‌మేకర్లు, వాణిజ్య ప్రకటనదారులు,ఇతర క్రియేటర్ల పనిని వీడియోల పరంగా మరింత సులభతరం చేసే క్రమంలో సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌ను సొంతంగా తయారు చేసింది. ఇంకా వివరంగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వీడియో ప్రొడక్షన్ చేపట్టేలా ఈ టూల్‌ను డిజైన్ చేయడం జరిగింది.ఈ టూల్ పేరు స్పార్క్ ఒరిజినల్స్ .
ఒక వీడియోను తయారు చేసే క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌ను మిళితం చేసి ఒక వీడియోను వేగవంతంగా తయారు చేయడంలో స్పార్క్ ఒరిజినల్స్ అనే ఈ ఏఐ టూల్ ప్రత్యేకత చాటుతోంది. మనిషి యొక్క సృజనాత్మకతకు ఏఐ క్రియేటివిటీని జోడించి తద్వారా తయారయ్యే వీడియో క్వాలిటీ మరో లెవెల్ ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడే స్పార్క్ ఒరిజినల్స్ ఏఐ పనితీరు కనిపిస్తుంది. వీడియో మేకింగ్‌లో భాగంగా తయారయ్యే క్యారెక్టర్స్‌లో నిజంగా జీవం ఉందా అనే అనుభూతిని స్పార్క్ ఒరిజినల్స్ కల్పిస్తుంది.ఇక యానిమేషన్స్, స్కెచ్ స్టైల్ విజువల్స్‌తో పాటు మరెన్నో విజువల్స్‌ను క్రియేట్ చేయగల సత్తా స్పార్క్ ఒరిజినల్స్ ఏఐ టూల్‌కు ఉంది.
స్పార్క్ ఒరిజినల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి తయారయ్యే ఒక వీడియో ఎలాంటి అనుభూతిని అందిస్తుందో ఈ టీజర్ చూస్తే తెలుస్తుంది.
కీలక విషయాలు:
* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కథ చెప్పడం: ఒక ఐడియాను తీసుకుని దానికనుగుణంగా ఏఐని వినియోగించి వీడియోను తయారు చేయడం. వీడియోకు సంబంధించిన ఇన్‌సైట్స్ ఇవ్వడం.
* సీన్ ప్రోటోటైపింగ్: వీడియో చేసే ముందు అందుకు తగ్గట్టుగా విజువల్స్, లైటింగ్, కంపొజిషన్ వంటి కీలక అంశాలను సిద్ధంగా ఉంచడం ద్వారా సమయంతో పాటు స్ట్రీమ్‌లైన్ ప్రొడక్షన్ కూడా ఆదా అవుతుంది.
* * పూర్తిస్థాయిలో ప్రీ ప్రొడక్షన్ సపోర్ట్: స్క్రిప్ట్ నుంచి తెరపైకి వెళ్లే వరకు ప్రతి అడుగులో గైడెన్స్ ఇస్తూ ప్రాజెక్టు చాలా సాఫీగా పూర్తయ్యేలా సహాయం చేస్తుంది స్పార్క్ ఒరిజినల్స్ ఏఐ టూల్.
*B2B ఫోకస్:*
ఫిల్మ్‌మేకర్లు, క్రియేటర్లు, అడ్వర్టయిజర్ల సహకారంతో చలన చిత్రాలు, టీజర్లు, చిన్నపాటి వీడియోలను తయారు చేసే సామర్థ్యం ఈ ఏఐ ఆధారిత ప్రొడక్షన్‌కు ఉంది. ఇక బహుభాషల్లో వీడియోను తయారు చేయడం ఈ ఏఐ ఆధారిత స్టూడియో బలం అని చెప్పాలి.హిందీ, తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ,ఒడియా, బెంగాలీ,గుజరాతీ, మరాఠీలాంటి ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లీష్,అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్ భాషల్లో కూడా కంటెంట్‌ను సృష్టించడం ఈ ఏఐ టూల్ బలం, ప్రత్యేకత. అంతేకాదు వివిధ రంగాల్లో అంటే ఎంటర్‌టెయిన్మెంట్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, లైఫ్‌స్టయిల్‌లకు సంబంధించి అందమైన వీడియోలను తయారు చేయగల సామర్థ్యం ఉంది. కస్టమర్ అవసరాలకు అనుగుణంగా స్పార్క్ ఒరిజినల్స్‌లో ఆప్షన్స్ ఉన్నాయి.పబ్లిక్ క్యాంపెయిన్‌లను విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా మంచి ఫలితాలను అందించేందుకు కావాల్సిన మార్కెటింగ్ మెలుకువలు కూడా స్పార్క్ ఒరిజినల్స్‌లో పొందుపర్చడం జరిగింది.
B2C ఫోకస్: బి టూ సి విభాగం విభిన్నమైన కంటెంట్‌ను సృష్టిస్తుంది. ఏఐ ఆధారిత యానిమేషన్స్ నుంచి జీవంపోసుకున్న వీడియోల వరకు ఉండే ఈ భిన్నమైన కంటెంట్ యూట్యూబ్, ఇన్స్‌టాగ్రామ్‌లాంటి సామాజిక మాధ్యమాల్లో కూడా షేర్ చేసుకునేలా ఉంటుంది.ఇలాంటి కంటెంట్ కచ్చితంగా ఎంగేజింగ్‌గా ఉండటమే కాకుండా అవగాహన కల్పిస్తూ, ప్రేరణగా నిలుస్తాయి. సంప్రదాయ మరియు డిజిటల్ మీడియా మేళవింపుతో స్థానిక ప్రేక్షకుల నుంచి అంతర్జాతీయ ప్రేక్షకులకు వివిధ కథనాల ద్వారా అవగాహన కల్పించడం, లోతైన వివరణ విశ్లేషణలు అందించడమే లక్ష్యంగా ఈ టూల్ పనిచేస్తుంది. స్థానిక నేరాల నుంచి చారిత్రక ఘట్టాలు, శాస్త్రీయ ఆవిష్కరణలు,పర్యావరణ సమస్యలు వంటివి స్పార్క్ ఒరిజినల్స్ ఏఐ టూల్ కవర్ చేస్తుంది. అంతేకాదు వీటిపై సంబంధిత సమాచారం చేరవేస్తూ,ప్రేరణగా నిలుస్తూ ఉత్సాహాన్ని నింపడంతో పాటు సమస్యలపై చర్యలు తీసుకోవడంలో సహాయం చేస్తుంది.
స్పార్క్ ఒరిజినల్స్ గురించి తెలుసుకోండి
కంటెంట్ క్రియేట్ చేయడం కోసం,కంటెంట్ సహకారం కోసం, లేదా స్ఫూర్తిని పొందడం కోసం ఇలా అన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం లక్ష్యంగా స్పార్క్ ఒరిజినల్స్ ఏఐ డిజైన్ చేయడం జరిగింది. మనిషి యొక్క కళాత్మక దృష్టికి ఏ మాత్రం తగ్గకుండా మంచి క్వాలిటీ వీడియో ప్రొడక్షన్ ఇచ్చే దిశగా ఈ టూల్ తయారు చేయడం జరిగింది.స్పార్క్ ఒరిజినల్స్ టూల్స్ వినియోగించి కథనాలు ఎలా చెప్పబడ్డాయో, దీన్ని ఉపయోగించి ఆర్టిస్టులు ఎలాంటి కంటెంట్ తయారు చేశారో తెలుసుకోవాలంటే యూట్యూబ్‌పై స్పార్క్ ఒరిజినల్స్‌ను వీక్షించండి. మరిన్ని వివరాలకు/సమాచారం కోసం కు లాగిన్ అవ్వండి.
*స్పార్క్ ఒరిజినల్స్ గురించి..*
స్పార్క్ ఒరిజినల్స్ అనేది వన్ఇండియా వెంచర్, ఇది B2B మరియు B2C ప్రేక్షకుల కోసం AI- ఆధారిత వీడియో ప్రొడక్షన్‌ని అందిస్తోంది.ఒక ఆర్టిస్ట్ ఎలాంటి క్రియేటివిటీతో ఆలోచిస్తాడో, అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా వేగవంతమైన, సమర్థవంతమైన,సృజనాత్మకతతో కూడిన వీడియో కంటెంట్‌ను అందిస్తుంది. ఇది బ్రాండ్ల వృద్ధిలో, ఫిల్మ్‌మేకర్లకు,క్రియేటర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సినిమా నిర్మాణంలో, మార్కెటింగ్ క్యాంపెయిన్స్ లేదా సోషల్ మీడియా వీడియోస్ ద్వారా ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మీ ఆలోచన శైలికి ఏమాత్రం తగ్గకుండా మరింత ప్రభావం చూపేలా సహాయం చేస్తుంది స్పార్క్ ఒరిజినల్స్ ఏఐ టూల్.