గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సోమవారం గుడ్లవల్లేరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంజనీరింగ్, డిప్లమో కళాశాలల అధ్యాపకులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. టీడీపీ గుడ్లవల్లేరు మండల కార్యాలయంలో ముఖ్యనాయకులు, బూత్ కమిటీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు.
మండలంలోని 1,400 మంది ఓట్లర్లను కలిసి కూటమి ప్రభుత్వం పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించి పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓట్లు వేసేలా పనిచేయాలని ఆయన కోరారు. అనంతరం కౌతవరంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. టీడీపీ మండల అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ వల్లభనేని బాబూరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ వల్లభనేని వెంకట్రావు, జంగం మోహనరావు, టీడీపీ గుడివా డ పట్టణాధ్యక్షుడు దింట్యాల రాంబాబు, అడుసుమిల్లి రామ్మోహనరావు, డీసీ చైర్మన్ పాలేటి వీరాంజనేయి లు, నీటి సంఘాల అధ్యక్షులు చలసాని శ్రీధర్, కరీం, తూము పద్మజ, పాల్గొన్నారు.
![]() |
![]() |