అభివృద్ధిని పెంపొందించడంలో సహకార సంఘాలు కీలకపాత్ర పోషి స్తాయని కర్నూలు కలెక్టర్ పి.రంజితబాషా అన్నారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా పోస్టర్ ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి అధికారికంగా 2025వ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా (ఐవైసీ) సహకార సంస్థ బీఎల్‌డీఏ బెటర్ వరల్డ్ అనే నినాదంతో నెలవారి లక్ష్యాలను నిర్ధేశించిందన్నారు. ఈ మేరకు జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఐవైసీ స్టేట్ అపెక్స్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో సి. వెంకట నారాయణమ్మ, డీసీవో రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |