ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అమరాపురం మండలంలోని హేమావతి గ్రామంలో 26వతేదీన నిర్వహించే హెంజేరు సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు ఎం.ఎ్‌స.రాజు ఆదేశించారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో కలిసి హేమావతి గ్రామంలో సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై వారు గ్రామస్థులతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడా ఎ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
![]() |
![]() |