ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తోండటంతో ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. తణుకు మండలం వేల్పూరు నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో 17 గ్రామాల్లో అలెర్ట్ జోన్ విధించారు. మూడు వారాల పాటు ఆంక్షలు కొనసాగనున్నాయి. దీంతో ఇతర ప్రాంతాలకు కోడిగుడ్లు, కోళ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. స్థానిక మార్కెట్‌లో కేజీ రూ.200 నుంచి రూ.160లకు చికెన్ ధరలు పడిపోయాయి. బర్డ్ ఫ్లూ వ్యాపించిన ప్రాంతాల్లో చికెన్ దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.కాగా గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కానూరు అగ్రహారం, పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ మండలం వేల్పూరులోని కోళ్లఫారాల్లో ఒక్కసారిగా వేల కొద్దీ కోళ్లు మరణిస్తున్నాయి. చనిపోయిన కోళ్ల శాంపిళ్లను అధికారులు పరీశీలించారు. అధికారులు పరిశీలించిన నమూనాల్లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో పౌల్ట్రీ పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లింది. వాస్తవానికి గోదావరి జిల్లాలైన తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కోళ్ల పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి.
![]() |
![]() |