మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. పొందూరు వెలుగు కార్యాలయంలో డీఆర్డీఏ, సెర్ప్, మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ పాలన, నాయకత్వంపై ఈసీలు, సీసీలు, సీఎఫ్లు, వీవోలకు శిక్షణ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఘాలుగా బలోపేతమైతే వ్యక్తులుగా బలోపేతం కాగలరని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు సీహెచ్ రామ్మోహన్, ఎంఎంఎస్ అధ్యక్షురాలు అరుణ ,ఏపీఎం రమణమూర్తి, సీసీ జి. శ్యామలరావు పాల్గొన్నారు.
![]() |
![]() |