గుడిపల్లిమండలం కోదండపురం గ్రామంలో శుక్రవారం అంగరంగ వైభోగంగా "పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి'' కళ్యాణ మహోత్సవ నిర్వహించారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొనిస్వామి వారిని దర్శించుకోని వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేవరకొండ నియోజక వర్గ ప్రజలంతా సుఖశాంతులతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్ధించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా,పిఏసియస్ చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి,మణిపాల్ రెడ్డి,మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల్ల వెంకటయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల గోవర్దన్ రెడ్డి ముచ్చర్ల ఏడుకొండలు, కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నీలం శ్రీనివాస్ , తెర సత్యం రెడ్డి, పాలింక, కొర్ర రాంసింగ్ నాయక్ అరుణ సురేష్ గౌడ్ వేమన్ రెడ్డి,ఆలయ కమిటీ చైర్మన్ గజ్జల వెంకటేశ్వర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |