భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంకి విహార యాత్ర కోసం కరేబియన్ దేశానికి వెళ్లి అదృశ్యం అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు మిస్టరీగా మారగా.. పోలీసులు ఆమెకు ఏమైందో తెలుసుకునేందుకు పెద్ద ఎత్తునే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా సముద్రంలో కొట్టుకుపోయిందా లేక కిడ్నాప్ అయిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టగా... షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆమె బట్టలు, చెప్పులు బీచ్ వద్దే దొరికాయి. దీంతో ఆమె నీళ్లలోనే కొట్టుకోపోయిందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.
అమెరికాలోని వర్జీనియాకు చెందిన 20 ఏళ్ల సుదీక్ష కోణంకి పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతోంది. అయితే ఇటీవలే ఆమె విహార యాత్ర కోసం తన స్నేహితులతో కలిసి డొమినికా రిపబ్లిక్ దేశానికి వచ్చింది. ముఖ్యంగా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ప్యూంటా కానా పట్టణానికి వెళ్లింది. మార్చి 6వ తేదీన అరక్కడి రియా రిపబ్లికా రిసార్ట్ వద్ద చివరి సారిగా కనిపించింది. తెల్లవారుజాము 3 గంటల వరకు స్నేహితులంతా కలిసి అక్కడే పార్టీ చేసుకోగా ఆ తర్వాత అందరూ హోటల్‌కు వెళ్లిపోయారు. కానీ సుదీక్ష కోణంకి ఎంతకూ తిరిగి రాకపోవడంతో స్నేహితులంతా వెతికారు.
అయినప్పటికీ లాభం లేకపోవడంతో.. స్నేహితులంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా ఆమె కిడ్నాప్ అయిందా లేక నీళ్లలోనే కొట్టుకుపోయిందా అని తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో ఆమె కోసం విపరీతంగా వెతికారు. కానీ ఎలాంటి ఉపయోగమూ లభించలేదు. అయితే తాజాగా సుదీక్ష కోణంకి చెప్పులు, బట్టలు గుర్తించినట్లు పోలీసులు అధికారులు వెల్లడిస్తున్నారు.
ఆమె తప్పిపోయిన బీచ్ వద్దే ఓ లాంజ్ కుర్చీలో ఆమె బట్టలు, చెప్పులు అధికారులకు దొరికాయి. అయితే ఆమె నీళ్లలోకి వెళ్లేముందు వాటిని అక్కడ వదిలి వెళ్లుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కానీ ఎక్కువ రోజులు కావండతో.. ఆ బట్టలు, చెప్పులు మట్టిలో కూరుకుపోయాయట. కానీ వాటిని గుర్తంచిన తర్వాత సుదీక్ష కోణంకి చివరి సారి వేసుకున్న బట్టలతో ఇవి సరిపోలగా.. ఆమె చెప్పులు కూడా అవేనని స్నేహితులు గుర్తించారట. దీంతో ఆమె నీళ్లలోకి వెళ్లే కొట్టుకుపోయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలోనే మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు
![]() |
![]() |