అందరితోపాటే విమానం ఎక్కిన ఓ మహిళ.. ముసుగు వేసుకుని, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతూ సిగరెట్ కాల్చింది. విపరీతమైన పొగ రావడంతో.. ప్రయాణికులు గొడవ చేశారు. ఆపమంటూ అడిగారు. కానీ సదరు మహిళ మాత్రం అస్సలే వినలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రయాణికులు సిబ్బందికి విషయం చెప్పగా.. వారొచ్చి ఆమె చేతిలోంచి సిగరెట్ లాక్కున్నారు. దీంతో కోపోద్రిక్తురాలైన మహిళ విమానానికి నిప్పు పెట్టే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా తాను కూర్చున్న చోటే లైటర్ సాయంతో ముందు సీట్లకు నిప్పంటించింది. అక్కడే ఉండే ఆమె చేస్తున్న పని చూసిన సిబ్బంది వెంటనే నీళ్లు పోసి మంటలను ఆర్పేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా అంతా షాక్ అవుతున్నారు. ఆపూర్తి వివరాలు మీకోసం.
ఇస్తాంబుల్ నుంచి సైప్రస్ వెళ్లే విమానం ఎక్కిన ఫాతిమా అనే మహిళ రచ్చ చేసింది. స్కార్ఫ్ కట్టుకుని, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ముఖమంతా కనిపించకుండా జాగ్రత్త పడిన ఫాతిమా ..ఎవరూ చూడకముందు తన బ్యాగులోంచి సిగరెట్ తీసి, లైటర్‌తో అంటించింది. ఆపై రెండు బుక్కలు తాగగానే గుప్పుమని పొగ రాగా తోటి ప్రయాణికులు గుర్తించారు. శ్వాస ఆడట్లేదు, ఆపమంటూ అడిగారు. కానీ ఫాతిమా మాత్రం వారి మాట వినలేదు. సిగరెట్ కాలుస్తూనే ఉంది. దీంతో తీవ్ర కోపోద్రేకానికి గురైన ప్రయాణికులు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో వారొచ్చి ఆమె వద్ద నుంచి సిగరెట్ లాక్కున్నారు.
తాగుతున్న సిగరెట్ తీసుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఫాతిమా ఆ విమానానికి నిప్పు పెట్టే ప్రయత్నం చేసింది. ముందున్న సీట్లకు తన చేతిలోని లైటర్ ద్వారా నిప్పు అంటించింది. అయితే విషయం గుర్తించిన సిబ్బంది బాటిళ్లతో నీళ్లు పోసి మంటలను ఆర్పేశారు. ఫాతిమా చేసి పనికి ప్రయాణికులు అంతా విపరీతంగా భయపడిపోయారు. కొందరు ఫాతిమా చేసిన రచ్చను వీడియోగా తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.
ఇది చూసిన ప్రతీ ఒక్కరూ మరీ ఇంత దారుణంగా ప్రవర్తించేందింటి ఆ మహిళ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వారిని అరెస్ట్ చేసి కొన్నేళ్ల పాటు జైల్లో ఉంచితేనే బుద్ధి వస్తుందంటూ ఓ నెటిజెన్ రాసుకోచ్చాడు. ఇంతకీ ఆమెను పోలీసులకు అప్పగించారా లేదా అంటూ కామెంట్ల రూపంలో మరికొంత మంది నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. మీరూ ఓసారి ఈ వీడియో చూసి ఏమనిపిస్తుందో కామెంట్ల రూపంలో వెల్లడించండి.
![]() |
![]() |