అన్యాయాలను ప్రశ్నించినందుకు, వారి దాడులను వ్యతిరేకించినందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ కార్యకర్తను టీడీపీ నాయకులు పొట్టనపెట్టుకున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, బీసీ కార్యకర్త కురబ లింగమయ్యను పొట్టనపెట్టుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుబ లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
![]() |
![]() |