శారీరక దృఢత్వం, సంపూర్ణ ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో దోహదపడుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగర శివార్లలోని ఊటుకూరు సర్కిల్ నుండి మాంట్ ఫోర్ట్ స్కూల్ వరకూ 6 కి.మీ సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించి, స్వయంగా పాల్గొని పోలీసు అధికారులకు, సిబ్బందికి స్ఫూర్తినిచ్చారు. సైక్లింగ్ సహజసిద్ధమైన వ్యాయామమని, ప్రతి ఆదివారం పోలీసులు, ప్రజలు సైక్లింగ్ చేయాలని ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa