AP: విశాఖలో ఆగస్టు 28 నుంచి 30 వరకు జనసేన విస్త్రృతస్థాయి భేటీ నిర్వహించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జనసేన ఎమ్మెల్యేలతో కలిసి విశాఖలో ఆయన ‘సేనతో సేనాని’ కార్యక్రమ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలోపవన్ కళ్యాణ్ పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఆగస్టు 28న జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఈ భేటీలో పర్యావరణం, రక్షిత మంచినీటి పథకం, ఉపాధి కల్పన, సుపరిపాలనపై చర్చిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa