ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజ్ణాన గని… డా. ఈడ్పుగంటి పద్మజారాణి…

Astrology |  Suryaa Desk  | Published : Thu, Aug 28, 2025, 08:12 PM

విజ్ణాన గని… డా. ఈడ్పుగంటి పద్మజారాణి… 
పట్టాలు ఆమెకు చుట్టాలు... రికార్డులు ఆమెకు నేస్తాలు.. 
జ్యోతిర్వాస్తు విజ్ణాన శాస్త్రాలు ఆమెకు వెన్నతో పెట్టిన విద్య…
మహిళలకు ప్రవేశం లేదు అనే రంగంలో ఇప్పుడామె నెంబర్ వన్...
ఒకటి కాదు..రెండు కాదు...ఏకంగా 21 డిగ్రీలు...ముఖ్యంగా జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాలలో ఫస్ట్ ర్యాంక్ తో పాటు అన్నింట్లోనూ బంగారు పతకాలు..
పీహెచ్.డి పట్టాభిషేకంతో పాటు...బంగారు పతకాభిషేకం పొందిన ఘనాపాఠి...
ఆమె పేరే... డా|| ఈడ్పుగంటి పద్మజారాణి. దేశవిదేశాల్లో భారత జ్యోతిర్వాస్తు శాస్త్ర పండితురాలిగా పేరున్న ఆమెకు శ్రావణ శుక్రవారము జన్మదినోత్యవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియచేస్తూ క్లుప్తంగా పరిచయం ఇది…


ఒకటి కాదు.. రెండు కాదు పదుల సంఖ్యలో పలు శాస్త్రాల్లో ప్రవేశం మాత్రమే కాదు.. ప్రావీణ్యం ఆమె సొంతం. జ్యోతిష్యం అంటే పురుషులకు మాత్రమే పరిమితం అనే బంధనాలు తెంచేసి జ్యోతిష్య శాస్త్రం పఠించి అందులో డాక్టరేట్, పీహెచ్.డి సాధించి రికార్డు సృష్టించారామె. మనిషిపై గ్రహాల ప్రభావం ఉందని చెప్పిన ఖగోళ శాస్త్రవేత్తల ఆలోచనలను డీకోడ్ చేస్తూ మనిషిని అప్రమత్తం చేసే విద్య ఉన్నది కేవలం ఇండియాలో మాత్రమే. సమస్త జీవకోటిపై గ్రహాల ప్రభావాన్ని వేళ్ల మీద లెక్కగట్టే అతికొద్దిమంది జ్యోతిష్య పండితులందరూ పురుషులే. అయితే.. ఆ రంగంలోకి ప్రవేశించి రాకెట్ లా దూసుకుపోతున్న ఏకైక మహిళ మాత్రం పద్మజారాణి మాత్రమే.

జ్యోతిష్యం అంటే మగవారు మాత్రమే చెప్పాలి. రాశులు.. కుండలిలు, జన్మ నక్షత్రాలు.. పురుషులే చూడాలి అనేది ఒకప్పటి కట్టుబాటు. కానీ.. కాదేదీ మగువకనర్హం... అనుకుంటే సాధించలేనిది ఏముంది అంటూ పద్మజారాణి ఆ రంగంలో అడుగు ముందుకేసి ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. జ్యోతిర్వాస్తు రంగంలోకి రావాలనుకునే మహిళలకు దిక్సూచిగా మారారు. ఏ విషయమైనా ఒక్క సారి చూస్తే నేర్చుకోగల ఏకసంధాగ్రహి ఆమె. తల్లి స్వర్గీయ పిశిపాటి దుర్గా కుమారి  గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేసే వారు. అప్పట్లోనే ఆమె బెనారస్ యూనివర్సిటీలో ఎంఏ గణితం లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. తండ్రి స్వర్గీయ సూర్యనారాయణ మూర్తి క్రిమినల్ లాయర్. వారిద్దరి నుంచి విజ్ఞాన వారసత్వాన్ని ఆమె ఆస్తిగా పొందారు. జ్యోతిష్యం మాత్రమే కాదు. వాస్తు, భరతనాట్యం, మోడలింగ్, మీడియా, న్యూమరాలజీ ఇలా చాలా రంగాల్లో ఆమె నెంబర్ వన్. 2012 నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో క్యాలెండర్లు, రాశిఫలాలు, పంచాంగాలు రచిస్తున్నారు, ఆమె పంచాంగ శ్రవణం భక్తి, వనిత tv, టీవీ9 వంటి ప్రసిద్ధ టీవీ ఛానళ్లలో ప్రసారమవుతోంది. 


డాక్టర్ రాణి జ్యోతిషం మరియు వాస్తు రంగంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 43వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఒరియెంటల్ హెరిటేజ్, కోల్‌కతా లో "లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డ్"  మరియు "జ్యోతిష మహాపాధ్యాయ" బిరుదు, “బంగారు పతకం” తో జ్యోతిషంలోను  మరియు "వరాహమిహిర అవార్డ్" , "వాస్తు సిద్ధాంత శిరోమణి" బిరుదుతో వాస్తు శాస్త్రంలో సత్కరించారు.

ఈడ్పుగంటి పద్మజారాణి 21 డిగ్రీలు చేసిన మహిళగా రికార్డు సృష్టించారు. ఎమ్మెస్సీ గణితం, ఎంఈడీ, ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, ఎంఏ జ్యోతిష్యం, ఎంఏ తత్వశాస్త్రం, ఎంఏ ఫలిత జ్యోతిష్యం, ఇంజినీరింగ్ వాస్తు, మెడికల్ అస్ట్రాలజీలో మరియు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ లో పీజీ డిప్లొమా, ఎంఫిల్, ఆస్ట్రాలజీలో పీహెచ్.డి, మరియు గౌరవ డాక్టరేట్ లతో అనేక బంగారు పతకాలను UGC ద్వారా గుర్తింపు పొందిన  యూనివర్సిటీలో సాధించారు. ఇందుకు గానూ ఆమె సాధించిన రికార్డులు, పతకాలు, అవార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆంధ్ర, కాకతీయ, ఉస్మానియా, కువెంపు, వెంకటేశ్వర, తెలుగు యూనివర్సిటీ, నేషనల్ సంస్కృత విశ్వ విద్యాలయం, కర్ణాటక సంస్కృత విశ్వ విద్యాలయాలలో ఆమె డిగ్రీ చేశారు. ప్రపంచంలోనే ఎక్కువ డిగ్రీలు చేసిన మహిళగా ఆమె పేరు మీద ప్రపంచ రికార్డు కూడా ఉంది. అంతేకాదు... చదివిన ప్రతి డిగ్రీలోనూ ఫస్ట్ ర్యాంక్ తో పాటు గోల్డ్ మెడల్ సాధించడం ఆమె ప్రత్యేకత. కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం, బెంగుళూరు లో జ్యోతిష్యంలో పీహెచ్.డి చేసి  ప్రొఫ్. పద్మాశేఖర్ గోల్డ్ మెడల్ సాధించిన తొలి మహిళగా పద్మజారాణి పేరు మీద IBR Achiever గా రికార్డు ఉంది 


డాక్టర్ పద్మజారాణి గత 17+ ఏళ్లుగా ఒక ప్రముఖ తెలుగు పత్రికకు జ్యోతిష కాలమిస్టుగా పంచాంగ రచయితగా విఖ్యాతులు, దీనికి గాను తెలంగాణ ప్రభుత్వంనుండి ఉత్తమ జర్నలిస్ట్ గా సత్కరించబడ్డారు. 2023లో హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మంత్రుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తెలంగాణ తొలి మహిళా వాస్తు, జ్యోతిష్య శిఖామణి, 21 డిగ్రీలు పొందిన విద్యావేత్తగా అప్పటి రాష్ట్ర మంత్రులు ఆమె టాలెంట్ ని కొనియాడారు.


కేవలం తెలుగులో పంచాంగం, జ్యోతిష్యం, వాస్తు చెప్పడం మాత్రమే కాదు.. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఆమె జ్యోతిర్వాస్తు, విద్యా రంగంలో అగ్రస్థానంలో నిలిచారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో 11 సార్లు, యూనిక్ వరల్డ్ రికార్డుల్లో 2 సార్లు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డుల్లో 2 సార్లు, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లో మొదలగు వాటి లో నమోదయ్యారు. దాంతో పాటే భరతముని, వంశీవేద ఉగాది పురస్కారం, సరస్వతీ బాయి దాదాసాహెబ్ ఫాల్కే, ఇంటర్నేషనల్ ఐకానిక్ వుమెన్ అవార్డ్, బ్లిస్ ఫుల్ క్వీన్స్ ఇంటర్నేషనల్ అవార్డ్ 2022తో పాటు ఇప్పటి వరకు ఆమె మొత్తం 500కి పైగా అవార్డులు అందుకున్నారు. ప్రపంచంలోనే 100మంది శక్తివంతమైన మహిళల జాబితాలో సైతం ఆమె చోటు సంపాదించారు.


నాన్ కమర్షియల్ లైవ్ “శుభదినం” డైలీ ప్రోగ్రాం ద్వారా  పంచాంగం, రాశిఫలాలు, నేటివైశిస్ట్యం ఆధ్యాత్మిక & జోతిష్య కార్యక్రమాన్ని ఫస్ట్ వుమన్ తెలుగు సెంట్రిక్ satellite ఛానల్ “వనిత టీవీ” లో విజయవంతముగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం డి.లీట్ (D.Litt) వైపు అడుగులు వేస్తున్నారు. 
  “స్థిరమైన గమ్యం...కచ్చితమైన మార్గం...రాజీలేని ప్రయత్నం నీదవ్వాలి అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది” - స్వామి వివేకానంద

విజేతల విజయ రహస్యం గురించి చెప్పిన మాటలివి. ఆ మాటలు తెలిసో.. తెలియకో కానీ నేను చేసిన ప్రయత్నం మాత్రం రాజీ లేనిదే. అందుకే ఈరోజు మీ అందరికీ నన్ను పరిచయం చేసింది. మనకు సంబంధం లేని… మనలాంటి వాళ్ళు లేని రంగంలోకి నువ్వు అడుగు వేస్తుంటే అస్సలు భయపడవద్దు. ఎందుకంటే ఎవరూ నడవని దారిలో ముందు నువ్వు వెళ్తేనే మార్గదర్శిగా నిలుస్తావు. నేనైతే అలాగే ఆలోచించాను. మీరు ఏ రంగంలోనైనా సరే... ముందుకే వెళ్లాలని నిర్ణయించుకోండి. విజేతలుగా నిలుస్తారు.


డా. ఈడ్పుగంటి పద్మజారాణి, జ్యోతిర్వాస్తు పండితులు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa