ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.6 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్

Astrology |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 11:31 AM

లావా కంపెనీ తమ కొత్త బోల్డ్ N1 5G స్మార్ట్‌ఫోన్‌ను ఈ దీపావళికి అమెజాన్‌లో ఆఫర్‌లో అందిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.6,999 కాగా, HDFC బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్లతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.699 డిస్కౌంట్ లభించి, మొత్తం రూ.6,300కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4K వీడియో రికార్డింగ్, డ్యూయల్ రియర్ కెమెరా (13MP మెయిన్, 5MP సెల్ఫీ), 5జీ చిప్‌సెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.ఇందులో 4 జీబీ ఫిజికల్ ర్యామ్‌తో పాటు 4జీబీ వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. దీనికి 64 జీబీ ఇంట్నర్నల్ స్టోరేజ్ కూడా ఉంది. ఈ లావా బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ HD+ రిజల్యూషన్ కలిగిన 6.75 ఇంచ్ స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్, మంచి బ్రైట్నెస్ కూడా ఉంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా దీనికి ఉంది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల బాగా పనిచేస్తుంది. ఈ లావా స్మార్ట్ ఫోన్ ఫేస్ అన్లాక్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్లూ, గోల్డ్ రెండు కలర్‌లో ఈ మొబైల్ ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa