ట్రెండింగ్
Epaper    English    தமிழ்

21 రోజులు మూడంటే మూడు ఫాలో అవ్వండి, హెవీ వెయిట్ ఉన్నా ఆటోమేటిగ్గా తగ్గుతారు

Life style |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 10:44 PM

డాక్టర్ ప్రశాంత్ ప్రకారం, 3 సింపుల్ రూల్స్ ఫాలో అయితే బరువుని చాలా వరకూ మేనేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ టిప్స్‌ని మనం రెగ్యులర్‌గా 21 రోజులు ఫాలో అయితే మెటబాలిజంమెరుగ్గా మారుతుంది. దీని వల్ల లాంగ్ టర్మ్‌లో కూడా వెయిట్‌ని మేనేజ్ చేయొచ్చు. చూడ్డానికి సింపుల్‌గా అనిపించినప్పటికీ మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎక్కువగా స్ట్రిక్ట్ డైటింగ్ లేకుండానే బరువుని మేనేజ్ చేయొచ్చు. త్వరగా బరువు తగ్గాలనుకునేవారు వీటిని హ్యాపీగా ఫాలో అయితే త్వరలోనే చాలా వరకూ బరువు తగ్గుతారని చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకోండి.


బరువు తగ్గాలంటే


బరువు తగ్గాలంటే ఫిజికల్ యాక్టివిటీ ఎంత ముఖ్యమో, పోషకాహారం కూడా అంతే ముఖ్యం. డాక్టర్ ప్రశాంత్ ప్రకారం బరువు తగ్గాలంటే బ్రెయిన్, మెటబాలిజం కూడా సరిగ్గా వర్క్ చేయాలి. మనం తినే ఆహారం ఎంత వరకూ తృప్తిగా అనిపించిందో, ఆకలి కంట్రోల్ ఇవన్నీ బ్రెయిన్ సరిగ్గా చేస్తే అది మెటాబాలిజంపై ఎఫెక్ట్ పడి బాడీలో ఫుడ్ ప్రాసెసింగ్ జరుగుతుంది. మనం సరైన విధంగా ఓ రొటీన్ క్రియేట్ చేసి ఫాలో అయితే, హెల్దీగా వెయిట్ తగ్గొచ్చు.


21 రోజుల పాటు సరైన విధంగా తినడం


మనం బరువు తగ్గాలంటే మంచి రొటీన్‌ని రోజూ ఫాలో అవ్వాలి. సరైన ఫుడ్‌‌ని 21 రోజుల పాటు తింటే అది మన బాడీకి అలవాటు అవుతుంది. బాడీతో పాటు బ్రెయిన్ కూడా దానిని అడాప్ట్ చేసుకుంటుంది. దీంతో బరువు తగ్గడం ఈజీ అవుతుంది. మరి అలా 21 రోజులు ఏ విధంగా తినాలో తెలుసుకోండి.


టైమ్‌కి తినడం


చాలా మంది తినడమనగానే ఏం తింటున్నామని ఆలోచిస్తారు. కానీ, ఎప్పుడు తింటున్నామనేది పట్టించుకోరు. కానీ, డాకట్ర్ ప్రకారం, రోజూ సరైన టైమ్‌కి తినాలి. ముఖ్యంగా ఎండ ఉన్న టైమ్‌లో తినడం మంచిది, అంటే సాయంత్రం టైమ్‌లో తింటే ఆహారం సరిగ్గా బాడీకి అబ్జార్బ్ కాదు. జీర్ణమవ్వదు. ఆ టైమ్‌లో మెటబాలిజం తగ్గుతుంది. కాబట్టి, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తిన్న ఆహారం కూడా జీర్ణ మవ్వక ఫ్యాట్‌లా స్టోర్ అవుతుంది. అందుకే, ఉదయం వేళలో సరిగ్గా చెప్పాలంటే సూర్యుడు వెలుగినిస్తుండగా తినడం చాలా మంచిది. దీని వల్ల మెటబాలిజం సరిగా ఉంటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. బరువు పెరగరు.


రోజు ఎన్నిసార్లు తినాలో ముందుగానే డిసైడ్ అవ్వడం


అదే విధంగా, ఆహారం తినడం విషయంలో కూడా రోజుకి ఎన్నిసార్లు తినాలో ముందుగానే డిసైడ్ అవ్వండి. రోజుకి ఒకటి, రెండు, మూడు ఇలా ఎన్నిసార్లు తింటారో తినండి. కానీ, మద్యమద్యలో స్నాక్స్ ముట్టుకోవద్దు. దీంతో ఆహారం సరిగ్గా తీసుకోరు. తీసుకోవాల్సిన టైమ్‌లో తీసుకోరు. మీరు సరైన టైమింగ్స్ పెట్టుకుని ఆ టైమ్‌కే తింటే అదే టైమ్‌కి మీ బ్రెయిన్, బాడీ ఫిక్స్ అయిపోతుంది. దీంతో ఆకలి అవ్వడం, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మధ్యమధ్యలో చిరు తిళ్ళు తింటూ ఆహారాన్ని మళ్ళీ మీకిష్టమైన టైమ్‌కి తింటే బాడీకి, బ్రెయిన్ అర్థమవ్వక మీకు జీర్ణ సమస్యలు ఇతర సమస్యలు రావొచ్చు. కాబట్టి, ఫిక్స్‌డ్ టైమింగ్స్ పెట్టుకుని ఫాలో అవ్వండి.


21 రోజులు కచ్చితంగా


ఇప్పుడు చెప్పినవి కచ్చితంగా 21 రోజులు ఫాలో అవ్వండి. సైంటిఫికల్లీ మనం ఏదైనా కొత్త అలవాటు మన బాడీకి అలవాటు చేయడానికి 21 రోజులు టైమ్ పడుతుంది. 21 రోజుల తర్వాత వద్దన్నా కడా ఆటోమేటిగ్గా అదే అలవాటు కొనసాగుతుంది. కాబట్టి, దీనిని 21 రోజుల పాటు కచ్చితంగా ఫాలో అయితే మీ మెటబాలిజం సరిగ్గా పనిచేస్తుంది. ఎలాంటి డైట్, స్ట్రెస్ లేకుండా ఈజీగా బరువు తగ్గుతాయి.


బరువు తగ్గించే 3 రూల్స్


21 రోజుల మ్యాజిక్


కొత్త అలవాట్లు బాడీకి, బ్రెయిన్‌కి అలవాటు కావడానికి 21 రోజులు సరిపోతుంది. దీంతో మీరు కచ్చితమైన రిజల్ట్స్ చూస్తారు. అంతేకాదు, వీటిని కూడా లాంగ్ టార్మ్‌లో కంటిన్య చేయడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా, హెల్దీ ఫుడ్స్ తీసుకుంటూ కొద్దిపాటు ఎక్సర్‌సైజ్ మంచి హెల్దీ లైఫ్‌స్టైల్ ఫాలో అయితే కచ్చితంగా మీ బరువులో తేడాని మీరు చూస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa