ఉదయం నుంచి రాత్రి వరకు ఇయర్‌ఫోన్లు తప్పనిసరి అయిపోయాయి చాలామందికి. మ్యూజిక్, పాడ్‌కాస్ట్‌లు, కాల్స్... ఏదైనా సరే, శరీరంలో భాగమైపోయినట్లు వాటిని వాడేస్తుంటారు. కానీ ఈ అతి వినియోగం ఏమీ మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత మూడేళ్లుగా రోజుకు సగటున 12 గంటలు ఇయర్‌ఫోన్లు ఉపయోగించిన ఓ యువతి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. చెవుల్లో నొప్పి, వినికిడి సామర్థ్యం తగ్గిపోవడం, నిరంతరం 'టిన్' అనే శబ్దం వినిపించడంతో ఆమె ENT స్పెషలిస్ట్‌ను కలిసింది.
పరీక్షల అనంతరం వైద్యులు షాకింగ్ నిజం వెల్లడించారు – చెవి పొరలో తీవ్ర ఇన్ఫెక్షన్ ఏర్పడి చీము చేరింది. ఇయర్‌ఫోన్ల అతి ఉపయోగం వల్ల చెవి కాలువలో ధూళి, చెమట చేరి బ్యాక్టీరియా పెరిగిపోతాయని వివరించారు.
నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు: ఇయర్‌ఫోన్లను రోజుకు 4-5 గంటలకు మించి వాడకూడదు, వాల్యూమ్ 60 శాతం కంటే తక్కువగా ఉంచాలి. రెగ్యులర్‌గా క్లీన్ చేయడం, బ్రేక్స్ తీసుకోవడం తప్పనిసరి. లేకపోతే వినికిడి శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa