భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య రాజుకున్న వివాదం మరింత ముదురుతోంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) యాంకరింగ్ ప్యానెల్ నుంచి భారత ప్రముఖ ప్రెజెంటర్ రిధిమ పాఠక్‌ను తొలగించారని వచ్చిన వార్తలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే, ఈ వార్తలను రిధిమ ఖండించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తనంతట తానే ఈ టీ20 లీగ్ నుంచి వైదొలిగినట్లు ఆమె స్పష్టం చేశారు.జనవరి 3న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించడంతో ఈ వివాదం మొదలైంది. దీనికి ప్రతిగా బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది. టీ20 ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa