ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరువుపోయింది.. అసిమ్ మునీర్‌ను అడ్డుకున్న సెక్యూరిటీ

international |  Suryaa Desk  | Published : Sun, Feb 15, 2026, 08:54 PM

ఎప్పుడూ డాంభికాలు పలికే పాకిస్తాన్ ‌ నేతలకు అంతర్జాతీయంగా ఏమాత్రం విలువ ఉండదు. ఇది ఇప్పటివరకే చాలాసార్లు రుజువు అయింది. ఇక ప్రస్తుతం పాకిస్తాన్‌లో అత్యంత ప్రముఖ వ్యక్తిగా ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌.. విదేశీ పర్యటనకు వెళ్తే మాత్రం ఏ మాత్రం గౌరవం ఉండదు అనేందుకు మరో ఉదాహరణ ఇప్పుడు జరిగింది. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ హోదాలో ఉన్న అసిమ్ మునీర్.. తాజాగా జర్మనీలో జరుగుతున్న 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు వెళ్లగా.. అక్కడ సెక్యూరిటీ అడ్డుకున్నారు.


మ్యూనిచ్‌ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు తన టీమ్‌తో కలిసి జర్మనీకి వెళ్లిన అసిమ్ మునీర్‌ లోపలికి వెళ్తుండగా.. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆయనను ఆపేందుకు ప్రయత్నం చేశారు. ఐడీ కార్డు ఎక్కడ అంటూ ప్రశ్నించారు. ఉందని అసిమ్ మునీర్, ఆయన సిబ్బంది చెప్పగా.. ఐడీ కార్డు కన్పించేలా ఉంచండి అని ఆయనకు సూచించారు. దీంతో అక్కడ అసిమ్ మునీర్‌కు కొంత అవమానకరమైన పరిస్థితి ఏర్పడింది.


ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. పలువురు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది దాన్ని దౌత్యపరమైన ఇబ్బందిగా అభివర్ణించగా.. మరికొందరు మాత్రం ఇలాంటి హైలెవల్ ఈవెంట్లలో సాధారణ సెక్యూరిటీ ప్రొటోకాల్‌ అని పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పాకిస్తాన్‌ మాజీ సైనికాధికారి ఆదిల్ రజా సెటైరికల్‌గా స్పందించారు. అంతర్జాతీయ వేదికలపై అసిమ్ మునీర్‌ను ఎవరూ గుర్తించరు అంటూ తెలిపారు.


ఇక మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు పాక్ ఫీల్డ్ మార్షల్ అసిమ్‌ మునీర్‌ను ఆహ్వానించడంపై జర్మనీలో తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తం అవుతోంది. పాకిస్తాన్‌లో అక్కడి సైన్యం.. తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన చేస్తోందని.. కొన్ని రాజకీయ సంస్థలు తీవ్ర ఆరోపణలు గుప్పించాయి. ఈ క్రమంలోనే మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌ వద్ద కూడా పలువురు నిరసనలు తెలిపారు.


గతేడాది జూన్‌లో అమెరికా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్‌కు.. తీవ్ర అవమానం ఎదురైంది. అమెరికాలో నివసిస్తున్న పాక్ జాతీయులు.. అసిమ్ మునీర్‌కు వ్యతిరేకంగా అక్కడ నిరసనలు చేయడం, అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయడం తీవ్ర దుమారం రేపింది. వాటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa