దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాలతో మొదలయ్యాయి. కొద్దిసేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 133.24 పాయింట్ల నష్టంతో 58,003.12 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 55.95 పాయింట్ల నష్టంతో 17,289.50 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.78.70గా ఉంది. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్ టెల్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.