చైనాలో ప్రస్తుత కరోనా వేవ్‌తో కలిపి మూడు నెలల్లో మూడు వేవ్‌లు వచ్చే అవకాశం ఉందని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) హెచ్చరించింది. ప్రస్తుత కరోనా వేవ్ జనవరి మధ్యకల్లా ముగుస్తుందని, ఆ తర్వాత వెంటనే మళ్లీ కేసుల పెరుగుదల ప్రారంభమై సెకండ్ వేవ్ వస్తుందని పేర్కొంది. ఫిబ్రవరి చివర్లో మూడో వేవ్ రావొచ్చని అంచనా వేసింది. ప్రజల నిరసనలతో చైనాలో జీరో-కొవిడ్ పాలసీని ఎత్తేసిన తర్వాత అక్కడ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దవాఖానలన్నీ రోగులతో నిండిపోతున్నాయి. బెడ్లకు, ఔషధాలకు కొరతగా ఉంది. శ్మశానవాటికల్లో కూడా రద్దీ పెరిగిందని ఇటీవల హాంకాంగ్ పోస్టు రిపోర్టు చేసింది. రోజుకు దాదాపు 50వేల కేసులు నమోదవుతున్నట్లు తెలిపింది.