అనంతపురం జిల్లా, యాడికి, మండలంలో మూడు రోజుల క్రితం చిన్నపాటి ఘర్షణను దృష్టిలో ఉంచుకొని మంగళవారం ఇరువర్గాల ఇళ్లమీద పడి కారంపొడి చల్లుకొని, ఇటుకలతో దాడిచేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఒక వర్గానికి చెందిన ముగ్గురు, మరోవర్గానికి చెందిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాలమేరకు చిన్నవేపమానువీధి సమీపాన డిసెంబరు 31న న్యూఇయర్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఒక వర్గానికి చెందిన నారాయణస్వామి, జయచంద్ర తదితరులు, మరొక వర్గానికి చెందిన భీమారావు మనవళ్లు భరత, వినయ్‌లు గొడవ పడ్డారు. దీనికి సంబంధించి ఇరువర్గాలు పోలీ్‌సస్టేషనకు వెళ్లగా పోలీసులు కేసు నమో దు చేయకుండా రాజీ ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం పోలీ్‌సస్టేషనకు వచ్చిన ఇరువర్గాల వారిని పోలీసులు మంగళవారం రమ్మన్నట్లు తెలి పారు. మంగళవారం ఉదయం 12గంటల సమయంలో నారాయణస్వామి, జయచంద్ర, వెంకటేష్, లోకేష్, హనీఫ్, సుబ్బరాయుడులతోపాటు మరికొంతమంది భరత, విన య్‌లకు చెందిన ఇళ్లపై దాడికి దిగారు. దీంతో ఆ వర్గం వారు ప్రతిఘటించారు. కారంపొడి చల్లుకొని, ఇటుకలు, కర్రలు, ఇనుప రాడ్‌లతో దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనలో భీమారావు వర్గానికి చెందిన విఠలాక్ష, కేశమ్మ, జయాంద్రలక్ష్మి గాయపడ్డారు. నారాయణస్వామి వర్గంలో నారాయణస్వామి, వెంకటరామయ్య గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకొని ఇరువర్గాలకు చెందిన 12 మందిని అదుపులోకి తీసుకొని పోలీ్‌సస్టేషనకు తరలించారు.